నేడు స్వరాజ్యకీయం కేవలం రాజకీయంగా మిగిలింది.
గాంధీ తత్వంతో నాంది పలికిన నా జీవితం
నేడు బ్రాందీ తత్వంలో బందీ అయ్యింది.
ఒకనాడు నాకనిపించింది, నేను మారిపోయానని.
స్వార్థానికి బానిసయ్యానని , అర్థంలేని జీవితం బ్రతుకుతున్నానని.
ఇన్నేళ్ళ నా రాజకీయ గమనంలో ఎక్కడో అనుకోకుండా
ఊహింకాని దిశలో తప్పటడుగులు మొదలయ్యాయని.
దిశా మారుద్దామని దశ విధాలుగా ప్రయత్నించా
శతవిధాలుగా నా మనసుతో మొరబెట్టుకున్నా
ససేమిరా నా మనసు విననంది.
పదవులపై మక్కువ పెరిగింది, పెదవులపై సత్యం పలకనన్నది.
బాపు నేర్పిన సత్యాగ్రహం అనే పదంలో, నేడు కేవలం ఆగ్రహం మాత్రం మిగిలింది.
ఒకరోజు అనుకోకుండా నాకో ఆలోచన కలిగింది.
అప్పుడడిగాను - గాంధీ, నువ్వేక్కాడున్నావని!
సమాధానం రాలేదు.
నిన్న రాత్రి కల వచ్చింది.
బాపు కనిపించాడు. చిరునవ్వు నవ్వాడు.
అప్పుడు మళ్ళీ అడిగాను - బాపు, నువ్వెక్కడ ఉన్నావని ?
చిరుమందహాసంతో ఇలా అన్నారు:
నేను అహింసా, సత్యాగ్రహం అనే రెండు ఆదర్శాలను పాటించాను.
నాతొ రావాలనుకున్న మీరు హింస, ఆగ్రహాలతో తప్పుదారి పట్టారు.
హింసను అంతం చేయండి,
ఆగ్రహానికి సత్యాన్ని జోడించండి.
నేను అక్కడే ఉన్నాను. మీ పక్కనే ఉన్నాను - అంటూ మాయమయ్యారు.

No comments:
Post a Comment